గాంధీ కుటుంబం మాట.. శిలాశాసనం: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

  • ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 
  • ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం
  • ప్రభుత్వ నిర్ణయం పై సర్వత్రా హర్షం
  • కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసిన జగదీశ్వర్ గౌడ్ 

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా సర్వత్రా సంతోషం వ్యక్త మవుతున్నది. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , నియోజకవర్గ/డివిజన్ అధ్యక్షులు, నాయకులతో కలిసి నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని, ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పిన ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని పేర్కొన్నారు. ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీకి నష్టమని తెలిసి కూడా ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఈనాడు రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రతి అడుగు ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతుందని అన్నారు

వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలనేదే సీఎం నినాదమన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయని, నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తుందని, ఆగస్టులో రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తుందని, ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, యువజన, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here