పేదలకు వసతులు, పట్టాలు వచ్చేంత వరకు పోరాటం చేస్తా : గజ్జల యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: మౌలిక వసతులు, పట్టాలు వచ్చేంత వరకు పోరాటం చేస్తానని గజ్జల యోగానంద్ పేదలకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడి, పేదలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కొన్నెండ్లుగా మియాపూర్ గ్రామ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, ఓంకార్ నగర్ మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గజ్జల యోగానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గత 40 సంవత్సరాల నుండి దాదాపు 2000 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనుకబడిన వర్గాల పేద ప్రజలు (పదివేల జనాభా) స్థిర నివాసాలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక, తాగునీరు సరిపడా రాక సతమతమౌతున్నారని బస్తీవాసులతో కలిసి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదన్నారు. స్థానిక ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాత ఇండ్లు కూలిపోగా.. తిరిగి నిర్మించుకునేందుకు సామాగ్రి తెచ్చుకుంటే.. సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నడ్డిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, ఓంకార్ నగర్ లోని సర్వే నెంబర్ 28 లో నివాసం ఉంటున్న పేదలకు ఇంటి స్థలాలకు పక్కా పట్టాలు ఇవ్వాలని, వర్షపు నీరు నివాసితులు ఇళ్ల లోకి పోకుండా శానిటరీ మరియు డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుకు చర్యలు వెంటనే ప్రారంభించాలని, పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలగు ప్రజల అవసరాలకు ఉపయోగపడే వ్యవస్థలను ఏర్పాటు చేయాలనీ యోగానంద్ డిమాండ్ చేశారు.

సర్వే నంబర్ 28 లో నివసిస్తున్న పేదలకు అనుకూలంగా (2 వేల కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించరాదని) హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పట్ల యోగానంద్ హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా జస్టిస్ ఎన్.తుకారాం జి, ఉజ్జల్ భూయాన్ లకు ధన్యవాదములు తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన అండగా ఉంటానని యోగానంద్ హామీ ఇచ్చారు. నాయకులు బుచ్చి రెడ్డి, ఎస్. రమేష్, మానిక్, నాయిని రత్న కుమార్, బాషా శివ, స్థానికులు పాండు, మోహన్, కృష్ణ, సందీప్, రాజు, రవీందర్, ఎం. గణేష్, ఎస్. శ్రీను పాల్గొని ప్రజావాజ్యం పిటిషన్ దాఖలు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన యోగానంద్ కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here