- జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ విభాగానికి ఘన సత్కారం
నమస్తే శేరిలింగంపల్లి: మహిళా దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజక వర్గం కార్యాలయంలో ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ జన సైనికుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ విభాగాన్ని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశం అభివృద్ది సాధించటంలో వారి పాత్ర చాలా కీలకమని తెలిపారు. గత కాలంనాటి సాంఘీక అసమానతలను దైర్యంగా ఎదుర్కొని మహిళలు నేటి రాజకీయాలలో ఇంకా ఎంతో అభివద్ధి సాధించాలని తెలిపారు.
మహిళలు చదువుకొని అభివృద్ది పథంలో అన్ని రంగాలలో పురోగమించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులు పాల్గొన్నారు.