నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందజేస్తామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వద్ద ఏర్పాటు చేసిన చేసిన ప్రజా పాలన కేంద్రంలో పర్యటించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.

ప్రజాపాలన కేంద్రాలలో ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను సంబంధించిన అన్ని రకాల దరఖాస్తులు అందుబాటులో ఉంచి, వాటికీ సంబందించిన అధికారులు, తమ సిబ్బంది అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగేశ్వరరావు, శ్రీను, సత్యం, వీరారెడ్డి, ప్రేమ, మహిళలు లక్ష్మీ, వినిత, శ్రావణి పాల్గొన్నారు.





