సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత 

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం నగర్ కాలనీ కి చెందిన చంద్రమౌళి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సిఎంఆర్ఎఫ్ నుంచి రూ. 15 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గాంధీ అందజేశారు.

సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి అందజేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు . ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాచర్ల భద్రయ్య, రమేష్ పటేల్, తిరుపతి రెడ్డి, కాశీనాథ్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here