శేరిలింగంపల్లిలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

  • జంట సర్కిళ్లలో తుది అభ్యర్థులు 51 మంది
  • అత్యధికంగా శేరిలింగంపల్లి నుండి 13 మంది
  • అత్యల్పంగా హఫీజ్ పేట్ నుండి ఐదుగురు 

నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరో పర్వం ముగిసింది. వివిధ పార్టీలకు చెందిన రెబెల్ అభ్యర్థుల బుజ్జగింపులు విజయవంతం అవ్వడంతో మెజారిటీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో ఆమోదం పొందిన 117 మంది అభ్యర్థులలో ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 66 మంది అభ్యర్థులు పోటీ నుండి తప్పుకున్నారు. చివరగా ఎన్నికల సమరంలో ఏడు డివిజన్లలో కలిపి 51 మంది మిగిలారు.

శేరిలింగంపల్లి సర్కిల్ లో పోటీ నుండి తప్పుకున్న 34 మంది

శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్ల నుండి 63 మంది అభ్యర్థులు 87 నామినేషన్లను దాఖలు చేయగా, పరిశీలనలో ఇద్దరు తిరస్కరణకు గురయ్యారు. ఉపసంహరణ పర్వంలో భాగంగా 61 మంది అభ్యర్థులలో 34 మంది పోటీ నుండి తప్పుకోగా చివరగా మూడు డివిజన్లలో కలిపి 27 మంది అభ్యర్థులు ఎన్నికల పోరులో తలపడనున్నారు. కొండాపూర్ డివిజన్ నుండి 17 మంది నామినేషన్ లు వేయగా 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్ ల ఉపసంహరణ చేసుకున్న అనంతరం 8 మంది అభ్యర్థులు చివరగా బరిలో నిలిచారు. గచ్చిబౌలి డివిజన్ నుండి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అత్యధికంగా 16 మంది ఉపసంహరించుకోగా బరిలో కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. శేరిలింగంపల్లి డివిజన్ నుండి 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 9 మంది పోటీ నుండి తప్పుకున్నారు. చివరగా 13 మంది ఎన్నికల్లో బ్యాలెట్ పై నిలువనున్నారు.

చందానగర్ సర్కిల్ లో మిగిలింది 24 మంది 

చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట, చందానగర్ డివిజన్ల నుండి 56 మంది అభ్యర్థులు 76 నామినేషన్ లు దాఖలు చేయగా 32 మంది ఉపసంహరించుకోగా చివరగా నాలుగు డివిజన్ల నుండి 24 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలారు. మాదాపూర్ నుండి 9 మంది నామినేషన్లు వేయగా ముగ్గురు పోటీనుండి తప్పుకున్నారు. ఈ డివిజన్ నుండి 6 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడనున్నారు. మియాపూర్ నుండి 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 9 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా చివరగా పోటీ లో 7 గురు మిగిలారు. హఫీజ్ పేట నుండి 18 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా 13 మంది పోటీ నుండి తప్పుకుని అత్యల్పంగా 5 గురు మాత్రమే ఎన్నికల సమరంలో నిలిచారు. చందానగర్ డివిజన్ నుండి 13 మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా 7 గురు ఉపసంహరించుకోగా బరిలో 6 గురు నిలిచారు.

గమనిక: మరి కొద్దిసేపట్లో బరిలో నిలువనున్న అభ్యర్థుల జాబితా.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here