- శుభాకాంక్షలు తెలిపిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: పటాన్ చెరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయనను బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని దీవెనలతో, ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు సంపూర్ణ ఆయురారోగ్య, ఆనందాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు.
