నమస్తే శేరిలింగంపల్లి: “లాక్‌డౌన్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్… చందానగర్ స.నెం.174లో రెవెన్యూ సూచిక బోర్డుల తొలగింపు” శీర్షికన మంగళవారం “నమస్తే శేరిలింగంపల్లి”లో ప్రత్యేక కథనం వెలువడిన విషయం విదితమే. కాగా ఆ కథనానికి శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు బుదవారం స్పందించారు. డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వంశీమోహన్ ఆదేశాల మేరకు సిబ్బంది రంగంలోకి దిగారు. డిప్యూటీ తహసిల్దార్ యూ.నరేష్ నేతృత్వంలో చందానగర్ సర్వే నంబర్ 174లో ఆక్రమార్కులు తొలగించిన ప్రభుత్వ సూచిక బోర్డులను తిరిగి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో సదరు ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని పాక్షికంగా కూల్చివేసిన సిబ్బంది తాజాగా ఆ కట్టడాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా గిరిదావార్ చంద్రారెడ్డి మాట్లాడుతూ స.నెం.174 ప్రభుత్వ స్థలమని దృవీకరించడం జరింగిందని, సదరు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సదరు స్థలంలోని కట్టడాలను పూర్తిగా నెలమట్టం చేశామని అన్నారు. ప్రభుత్వ సూచిక బోర్డులను సైతం తిరిగి ఏర్పాటు చేశామన్నారు. బోర్డులు తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఐతే తాజాగా నెలమట్టం చేసిన నిర్మాణంను ఆనుకోని కొనసాగుతున్న మరో భవన నిర్మాణం సైతం 174 సర్వెనెంబర్ లోకే వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడీ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం విషయంలో స్పష్టత ఇవ్వాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
?మంగళవారం వెలువడిన కథనం…
లాక్‌డౌన్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్… చందానగర్ స.నెం.174లో రెవెన్యూ సూచిక బోర్డుల తొలగింపు…