తెలంగాణ హాకీ చైర్మ‌న్‌గా కొండా విజ‌య్‌కుమార్‌… ప్ర‌క‌టించిన హాకీ ఇండియ‌ అధ్య‌క్షుడు న‌రేంద్ర బాత్ర‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ హాకీ చైర్మ‌న్‌గా శేరిలింగంప‌ల్లికి చెందిన కొండా విజ‌య్‌కుమార్ నియ‌మితుల‌య్యారు. బుద‌వారం రాష్ట్ర హాకీ బృందంతో జ‌రిగిన ప్ర‌త్యేక వెబినార్‌లో హాకీ ఇండియ‌ అధ్య‌క్షుడు న‌రేంద్ర బాత్ర తెలంగాణ హాకీ నూత‌న కార్య‌వ‌ర్గాన్ని నిర్ణ‌యించారు. చైర్మ‌న్‌గా కొండా విజ‌య్‌కుమార్‌, అధ్య‌క్షుడ‌గా స‌ర‌ల్ త‌ల్వార్‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా ప‌ద్మ‌శ్రీ ముఖేష్‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. మిగిలిన కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కొండా విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి తెలంగాణ హాకీ చైర్మ‌న్‌గా భాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు హాకీ ఇండియ‌ అధ్య‌క్షుడు న‌రేంద్ర బాత్ర‌, తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌, ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రంలో హాకీ క్రీడ అభివృద్ధికి కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషిచేస్తాన‌ని అన్నారు.

కొండా విజ‌య్‌కుమార్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here