నమస్తే శేరిలింగంపల్లి : స్వప్నిక రేహ ఫౌండేషన్ పలు సంస్థలు కలిసి రీకాన్ఫేస్ ఇండియా, జనహిత సేవ ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, సంకల్పం ట్రస్ట్ సంయుక్తంగా మియాపూర్ లోని నడిగడ్డ తండాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ పై , ఇతర సాధారణ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సుమతి వాసుదేవన్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్లు భార్గవ్ కుచ్చు, కావ్య సంకా లు ఉచిత కన్సల్టేషన్ హిమోగ్లోబిన్ టెస్ట్ నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో స్వప్నిక రేహ ఫౌండేషన్ సభ్యులు మహాలక్ష్మి, పల్లవి, కొండల రావు, తనిష్కా, వినయ్, వేణు, దీప, కళ్యాణి, రీనా, మణికంఠ, రాజు, మహిపాల్, సత్య, జనహిత సేవా ట్రస్ట్ హెల్త్ కన్వీనర్ మధుకర్, ట్రస్ట్ సభ్యులు, నడిగడ్డ తండా కమ్యూనిటీ సభ్యులు స్వామి నాయక్, తిరుపతి నాయక్, హనుమాన్ నాయక్, గోపి నాయక్, దశరత్ నాయక్, రాఘవేంద్ర, తుకారాం నాయక్, లకపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.