నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు మున్సిపాలిటీ 8 వ వార్డులో శనివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించి పదవి త్యాగం చేసి, మునుగోడు ప్రజల ఆత్మాభిమానం చాటడానికి బరిలో నిలిచిన మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్, తిరుపతి సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్ చండూర్ మున్సిపల్ బీజేవైఎం అధ్యక్షులు, సోమ శంకర్, స్థానిక నేతలు మాదగోని స్వామి, మన్యం ప్రవీణ్, దోటి శివ, సంగెపు సాయి, సోమ రాజు, గండూరి మల్లేష్, స్థానిక ప్రజాప్రతినిధులు , స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- చండూరు మున్సిపాలిటీ వార్డ్ ఇంఛార్జిలతో సమావేశం ..
మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపల్ పరిధిలోని భరత్ చంద్ర ఫంక్షన్ హాల్లో శనివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నియమించిన స్థానిక ఇంఛార్జిలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మట్లాడుతూ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మ రావు, జిల్లా ఇంచార్జి నాగూరావు రాంజీ, పటాన్ చేరు మాజీ జడ్పీటిసి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్, తిరుపతి సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రాజు, చండూర్ మున్సిపల్ బీజేవైఎం అధ్యక్షులు, సోమ శంకర్, స్థానిక నేతలు మాదగోని స్వామి, మన్యం ప్రవీణ్, దోటి శివ, సంగెపు సాయి, సోమ రాజు, గండూరి మల్లేష్ పాల్గొన్నారు.