ఐక్య రాజ్యసమితి దినోత్సవంపై విద్యార్థులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మియాపూర్ లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు వసుంధర అధ్యక్షత వహించగా… ముఖ్య అతిథిగా డాక్టర్ పూలపల్లి వెంకటరమణ, చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక సామాజిక అభివృ ద్ది, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థే ఐక్యరాజ్య సమితి అని అన్నారు. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్)రెండవ ప్రపంచ యుద్ధం నివారించేందుకు విఫలం కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945, అక్టోబర్ 24 నుండి తన కార్య కలాపాలను ఐక్యరాజ్యసమితి ప్రారంభించిందని తెలిపారు. ఐక్య రాజ్యసమితి దినోత్సవాన్ని అక్టోబర్ 24 రోజున ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు,యూనివర్సిటీ లల్లో సమానత్వం, శాంతి సహకారం కోసం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జాత్యహంకారాన్ని అంతం చేయండి.. శాంతిని నిర్మించండి అంటూ పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి.మదన్మోహన్ , ఎల్.సత్యనారాయణ రావు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వర రాజు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ పూలపల్లి వెంకటరమణ, చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here