కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలంలోని గుండ్రపల్లీ గ్రామం ఇన్ చార్జ్, శాసన సభ్యుడు కె.ఉపేందర్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డితో కలిసి మునుగోడు ఉప ఎన్నికలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ పార్టీ కరపత్రాలను ప్రజలకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ కు రక్షా అని అన్నారు. కార్యక్రమంలో వివేకానందనగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, గంగాధర్, మొహన్ ముదిరాజ్, MD ఇబ్రహీం, కార్తిక్ రావు, జంగం గౌడ్, బలరాం యాదవ్, తిరుపతి యాదవ్ అక్బర్ ఖాన్, రమణ రెడ్డి, నరేందర్ బల్లా, భగత్, వెంకట్ , స్వామి, అంజద్ , పరమేష్ , నరేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

చండూరు మండలంలోని గుండ్రపల్లీ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబందించిన కర పత్రాలను అందిస్తున్న విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here