కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తా : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • గాంధీని కలిసిన గోపన్ పల్లి హనర్ వివంటిస్ ప్లాట్స్ ఓనర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అపరేటివ్ సొసైటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి హనర్ వివంటిస్ ప్లాట్స్ ఓనర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అపరేటివ్ సొసైటీ అసోసియేషన్ కు నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గోపన్ పల్లి హనర్ వివంటిస్ ప్లాట్స్ ఓనర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అపరేటివ్ సొసైటీ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపన్ పల్లి హనర్ వివంటిస్ ప్లాట్స్ ఓనర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అపరేటివ్ సొసైటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డెబశిష్ , వైస్ ప్రెసిడెంట్ బోయల్ల అజయ్ చౌదరీ, జనరల్ సెక్రటరీ కట్ట సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ అమర్థ్య బెనర్జీ, బోర్డ్ డైరెక్టర్లు నగవర్ధన్ రెడ్డి, బిశ్వజిత్ నాథ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందిస్తున్న న గోపన్ పల్లి హనర్ వివంటిస్ ప్లాట్స్ ఓనర్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అపరేటివ్ సొసైటీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here