శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్లో ఈ నెల 15న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆ పార్టీ నాయకుడు గుర్ల తిరుమలేష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గుర్ల తిరుమలేష్, పడిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. నేతాజీ నగర్‌లోని గుల్మోహర్ పార్క్‌లో ఈ నెల 15న జరగనున్న కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ ఈ సందర్భంగా తిరుమలేష్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకిటి శంకర్, వడ్డే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






