మియాపూర్ ఎస్ఐ కుటుంబంలో విషాదం – మొదటి అంతస్థు నుండి క్రిందపడి కుమారుడి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: అపార్టుమెంటు మొదటి అంతస్థులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు క్రిందపడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిల్లాకు చెందిన లింగ్యా నాయక్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో డిటెక్టివ్ ఎస్ఐ గా పని చేస్తూ మదీనగూడలోని ఓ అపార్టుమెంటులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు సుఖేందర్(9) స్థానికంగా గల జెనెసిస్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. కాగా బుధవారం ఉదయం సుఖేందర్ మొదటి అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారీ కింద పడిపోయాడు.

సుఖేందర్

విషయం గమనించిన ఇరుగుపొరుగు వారు కుటుంబ సభ్యులకు తెలుపగా వెంటనే స్థానికంగా గల అర్చన ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల అవ్వడంతో పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించలేమని తెలపడంతో ప్రణామ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసు సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. రోజూ తమ మధ్య ఆటలాడే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here