- చందానగర్ పోలీస్ స్టేషన్ లో శేరిలింగంపల్లి మహిళ మోర్చా పిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళ సై పై అనుచిత వ్యాఖ్యలు(భూతులు)చేసిన రాష్ట్ర MLC పాడి కౌశిక్ రెడ్డి పై FIR బుక్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని శేరిలింగంపల్లి బీజేపీ మహిళ మోర్చా డిమాండ్ చేసింది. రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను, ఒక మహిళపై అవమానకరంగా బూతులు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మహిళ మోర్చా సభ్యులు తెలిపారు. ఆలస్యం చేయకుండా అతని పై వెంటనే చర్యలు తీసుకొని పదవి నుండి బర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలని శేరిలింగంపల్లి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పిర్యాదు చేసిన వారిలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి వరలక్ష్మి దీరాజ్, రంగారెడ్డి జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి మేరీ సొలొమాన్, రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు భీమని విజయ లక్ష్మీ, రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు విద్యా పాండే, రంగా రెడ్డి జిల్లా ట్రెజరర్ కాకర్ల అరుణ, చందానగర్ డివిజన్ మహిళ మోర్చా అధ్యక్షురాలు శోభ దూబే, చందానగర్ డివిజన్ కార్యదర్శి లలిత, శేరిలింగంపల్లి డివిజన్ కార్యదర్శి రజిని, గచ్చిబౌలి మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత, మాజీ వార్డ్ మెంబెర్ రమణ కుమారి, వెన్నం రెడ్డి రాధిక, సునీత, మౌనిక, జ్యోతి, పద్మలత, శ్రీదేవి, విజయ్ లక్ష్మీ ఉన్నారు.