ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో వేడుకగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం

  • ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో తన నివాసంలో ఘనంగా వేడుక
  • పాల్గొన్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి : 60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను 14 ఏళ్ళల్లో నెరవేర్చిన ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత, జన హృదయ నేత , తెలంగాణ రాష్ట్ర ప్రధాత, బంగారు తెలంగాణ నిర్మాత, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో నిర్వహించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలో కేక్ కట్ చేస్తున్న ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ. పాల్గొన్న కార్పొరేటర్లు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ మోడల్ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని, కేసీఆర్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు, తన తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని, సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్ల జీవించాలని మనసారా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, మహిళ సోదరీమణులు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here