- ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి: ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల మల్లారెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ గా షెడ్లు వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజల కోసం రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల హుడా కాలనీ లోని ప్లాట్ నం. 430, 431లలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ గా భారీ షెడ్డు వేశారని చెప్పారు.
ప్రభుత్వాన్ని మోసం చేసి అనుమతులు తీసుకుని జీహెచ్ ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న నిర్మాణదారుని పైన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. జిహెచ్ఎంసి ఖజానా ఇప్పటికే ఖాళీగా ఉందని, కాంట్రాక్టర్లకు సరైన సమయానికి బిల్లులు కూడా ఇవ్వడం లేదని, ఇలా ఎవరికి వారే ప్రభుత్వాన్ని మోసం చేయడం పట్ల మండిపడ్డారు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకొని అధికారులను మోసం చేసి నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారుల పైన తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు.