ఎంఈఓలను నియమించి.. పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించండి

  • రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ పద్మకు వినతి

నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి అర్బన్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ అధ్వర్యంలో శేరిలింగంపల్లి మండలం పూర్తి స్థాయి MEO నియామకం చేపట్టాలని, శేరిలింగంపల్లి మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలోని కనీస వసతులు, వివిధ సమసలపై రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ పద్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రంగారెడ్డి అర్బన్ బీజేవైఎం జిల్లా ఇన్ ఛార్జి పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలంలో భారత దేశ నలుమూలల నుంచి ముఖ్యంగా తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి వృత్తిరీత్యా కార్మికులు వలస వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారని, సుమారు 8 లక్షలకు పైగా జనాభా కలిగిన ఈ మండలం నుంచే తెలంగాణ రాష్ట్రానికి వివిధపన్నుల రూపంలో ఎక్కువ శాతం నిధులు వస్తాయని, కానీ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు అక్కడ కలుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాధుడే లేదన్నారు.
సుమారు ఐదు సంవత్సరాల నుండి శేరిలింగంపల్లి మండలానికి పూర్తిస్థాయి MEO లేకపోవడం, కేవలం ఇన్ ఛార్జి MEO నియమించి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే శేరిలింగంపల్లి మండలానికి పూర్తిస్థాయి ఎంఈఓను నియామకం చేసేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు చర్య తీసుకోవాలన్నారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మాట్లాడుతూ మియాపూర్, కొత్తగూడెం , మక్త మహబూబ్ పేట్, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ శాతం కొత్తగా అడ్మిషన్లు కోసం విద్యార్థులు వస్తుంటే అక్కడ కొత్త వారికి అడ్మిషన్ ఇవ్వడం లేదని, డిమాండ్ ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు వచ్చిన అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. హఫీజ్ పేట్, మదినగూడ, నానక్ రామ్ గూడెం ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా తరగతి గదులు నిర్మాణం చేయడానికి స్థలం ఉన్న ఇప్పటివరకు ఎలాంటి నియమాలు చేయలేదని తెలిపారు. ఈ పాఠశాలలను పదో తరగతి (హైస్కూల్ గా) వరకు పాఠాలు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు (ఉపాధ్యాయులు) సరిపడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత తొందరగా ప్రభుత్వ పాఠశాల సమస్యలను పరిష్కరించాలని బీజేవైఎం తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యాలయ కార్యదర్శి కైల రాజేందర్ రెడ్డి , బీజేవైఎం కొండాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయి సుకుమార్ పటేల్ , మాధపుర్ డివిజన్ బీజేవైఎం కార్యదర్శి శ్రావణ్ కుమార్ , బీజేవైఎం నాయకులు వంశీ , లోకేష్ , రాజు ఇతరులు పాల్గోన్నారు.

రంగారెడ్డి అర్బన్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ అధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ పద్మకు వినతిపత్రం ఇస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here