నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, బాపు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేడియో రూమ్ నుంచి ఉమేష్ చంద్ర విగ్రహం, ఎస్ ఆర్ నగర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్ పాల్గొని డాక్టర్ ధారావత్ ప్రీతి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రీతి మరణానికి కారణమైన ఎండి సైఫ్ కు ఉరిశిక్ష విధించాలని, కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి ను వెంటనే సస్పెండ్ చేయాలని, కాలేజీలలో ర్యాగింగ్ ను అరికట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, ఏఐబిఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సి. కిషన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆర్. మోహన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవా ణ శాఖ సంయుక్త కమిషనర్ జే పాండురంగ నాయక్, ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీచంద్ నాయక్, ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజాసింగ్, ఏఐబిఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, బాపు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు & ప్రధాన కార్యదర్శి హరి సింగ్ జాదవ్, అజయ్ సింగ్ చౌహన్, బాపునగర్ మహిళా నాయకురాలు రాణి బాయ్, బాపునగర్ చిన్నారులు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.