నాణ్యతా ప్రమాణాల్లో రాజీ వద్దు 

  • చెరువు అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలి 
  • అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం
మెడికుంట చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధి గుట్టల బేగం పెట్ లోని మెడికుంట చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రూ.68 లక్షల అంచనా వ్యయంతో మెడికుంట చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చెరువుల సుందరికరణలో భాగంగా చెరువు కట్టల పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం, అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం , పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఏఈ నాగరాజు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మరబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బ్రిక్ శ్రీనివాస్, రాంచందర్, ఓరుగంటి కృష్ణ, గోపాల్ నాయక్, సత్య రెడ్డి, బాలరాజు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here