‘ఆక్సిజన్ థెరపీ’ ఒక విప్లవాత్మకమైన విధానం

  • దంతవైద్యం & ఇంప్లాంటాలజీలో ఆక్సిజన్ థెరపీపై
    మెడికవర్ హాస్పిటల్స్ అంతర్జాతీయ వర్క్‌షాప్
  • పాల్గొన్న 100 మందికి పైగా దంత వైద్యులు

నమస్తే శేరిలింగంపల్లి : దంతవైద్యంలో అధునాతన టెక్నాలజీ పై మెడికవర్ హాస్పిటల్స్ లో దంత వైద్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హాస్పిటల్స్ నుంచి 100 మంది పైగా దంత వైద్యులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులుగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆక్సిజన్ థెరపీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి

యూకే నుంచి డాక్టర్ మినాస్ లెవెన్స్కీ, డాక్టర్ జోహన్‌తో సహా ప్రఖ్యాత నిపుణులు స్పీకర్స్ గా పాల్గొని అత్యాధునిక దంత ప్రక్రియల గురించి వివరించారు. అంనంతరం డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య, దంత ప్రక్రియలు, ఇంప్లాంటాలజీలో ఆక్సిజన్ థెరపీ వంటి వినూత్న విధానాలను సమగ్రపరచడం ప్రాముఖ్యతను అభినందించారు.

పాల్గొన్న వివిధ హాస్పిటళ్ల దంత వైద్యులు

అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ డెంటల్ సైన్సెస్ హెడ్ డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ “ఆక్సిజన్ థెరపీ అనేది డెంటిస్ట్రీలో, ముఖ్యంగా ఇంప్లాంటాలజీలో ఒక విప్లవాత్మక విధానమని తెలిపారు. ఆక్సిజన్ డెంటల్ థెరపీ చికిత్సా ప్రదేశానికి క్రియాశీల ఆక్సిజన్ వాయువును నియంత్రిత డెలివరీ చేసే ప్రక్రియని, ఇది అధిక సాంద్రీకృత ఆక్సిజన్‌తో ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పనిచేస్తుందని వివరించారు. యూకే, ఇతర దేశాల నిపుణులతో, అంతర్జాతీయ అనుభవాలు, దంత వైద్యంలో అత్యాధునిక టెక్నాలజీ పొందడానికి హైదరాబాద్‌లోని దంతవైద్యులకు వర్క్‌షాప్ ఒక వేదికను అందించిందని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here