ఒక్క రోజులోనే..

  • మేడ్చల్ గోల్డ్ షాప్ రాబరీ కేసును ఛేదించిన సైబరాబాద్, మేడ్చల్ పోలీసులు
  • పదహారు బృందాలుగా ఏర్పడి గాలింపు
  • నజీం అజీజ్, షేక్ సోహైల్ అరెస్ట్, పరారిలో సల్మాన్
  • మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
  • పోలీసులకు సీపీ అభినందన

నమస్తే శేరిలింగంపల్లి : సంచలనం సృష్టించిన మేడ్చల్ గోల్డ్ షాప్ రాబరీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 20న మేడ్చల్ లోని జగదాంబ జ్యువెలరీ షాప్ లో నజీమ్ అజీజ్, షేక్ సోహైల్, సల్మాన్ దొంగతనానికి పాల్పడ్డారు.

మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి

వీరిలో ఒకరు బురఖా, మరొకరు మాస్క్ వేసుకున్నారు. బైక్ పై వచ్చిన వారు బంగారం షాపు యజమానిని బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీ కేసుకు సంబంధించి నిందితులు పక్కా రెక్కీ నిర్వహించారు. రాబరీ సమయంలో అవసరమైతే చంపడానికి కూడా ప్లాన్ చేశారని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ రాబరీలో మొత్తం ముగ్గురు పాల్గొన్నారని, ఇద్దరినీ అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దొంగలను పట్టుకునేందుకు 16 టీంలను ఏర్పాటు చేశామని, దొంగతనం జరిగిన చోట నుండి 200 సీసీటీవీ కెమెరాలు పరిశీలించామని తెలిపారు. చోరీకి పాల్పడిన అనంతరం దొంగలు అక్కడి నుండి బైక్ పై పరారై కొంతదూరంలో బైక్ పడేసి వెళ్లినట్లు తెలిసిందన్నారు. వారు ఉపయోగించిన ద్వి చక్రవాహనాన్ని ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీ చేశారన్నారు. నిందితులు ఇటీవల చాదర్ ఘాట్ లోనూ దొంగతనానికి పాల్పడినట్లు సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.

మేడ్చల్ గోల్డ్ షాప్ రాబరీ కేసును ఛేదించిన సైబరాబాద్, మేడ్చల్ పోలీసులు

ఈ కేసులో ఏ1 నజీం అజీజ్, గతంలో రెండు కేసులలో నిందితుడిగా గుర్తించారు. అజీజ్ సమాచారంతో ఏ2 షేక్ సోహైల్ ను పట్టుకున్నామని, ఇతను ఏడు కేసులలో నిందితుడని తెలిపారు.  ఏ3 సల్మాన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. దొంగతనం కోసం గత పది రోజులుగా నిందితులు హైదరాబాద్,  సైబరాబాద్ పరిధిలో గోల్డ్ షాపులపై రెక్కీ నిర్వహించారని, ఈ కేసును 24 గంటల్లోనే చేధించిన పోలీసులను సీపీ అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here