- శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నో పోరాటాలు, తెలంగాణ రాష్ట్రం కోసం.. ఆ తదినంతరం అధికారుల ఉద్యోగుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఎం బి కృష్ణ యాదవ్ అని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎం బి కృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శాలువాతో సత్కరించారు. కృష్ణ యాదవ్ చేసిన పోరాట పటిమను తెలంగాణ ప్రజలందరూ గుర్తుంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు వి. మమత. ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ. టి రవీందర్రావు. అరుణ్ కుమార్. వెంకటయ్య. జి వెంకటేశ్వర్లు. లక్ష్మణ్, శిరీష, లావణ్య. డాక్టర్ రామారావు పాల్గొన్నారు.
