నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఆవాస అపార్టుమెంట్ లో లైక్ మీ సెలూన్ బ్యూటీ పార్లర్ షాపును రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి హాజరై ప్రారంభించారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు వీరా కుమారికి శుభాకాంక్షలు తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాగం సుజాత యాదవ్ ఆకాంక్షించారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే అసలైన మహిళా సాధికారత లభ్యమైనట్లు చెప్పారు.
