నమస్తే శేరిలింగంపల్లి: దేశ రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా నిలిచిన మహనీయులు అటల్ బిహారీ వాజ్ పేయి అని, బిజెపి పార్టీని స్థాపించి అధికారాన్ని సాధించి భారత ప్రధానిగా దేశాన్ని దేవాలయంగా, సమాజాన్ని కుటుంబంగా కనీసం సొంత ఇల్లు కూడా లేని బ్రహ్మచారిగా అహర్నిశలు భరతమాత సేవలో తరించిన కర్మయోగి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆల్విన్ ఎక్స్ రోడ్ లోని బిజెపి కార్యాలయంలో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని నిర్వహించారు. బిజెపి నాయకులతో కలసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయత, ఉదాత్తత, మానవత కలగలిసిన మేరుశిఖరమని, ప్రత్యర్థులను సైతం తన వాగ్దాటితో మంత్రముగ్దులను చేయడమే కాకుండా రాజకీయాలను, కవిత్వాన్ని సమతూకం చేసిన మహోన్నతులు వాజ్ పేయి అన్నారు. దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు పని చేస్తామని, వాజ్ పేయి దేశంలో ప్రపంచ విశ్వగురువుగా నిలిపే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోదీ బాటలో పయనిస్తూ ఈ దేశ భక్తులుగా వాజపేయి కలలను నిజం చేద్దాం అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం చందానగర్, మియాపూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాజ్ పేయి జయంతి లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, మనోహర్, రవి గౌడ్, మణిక్ రావు,జితేందర్, బాబు రెడ్డి, లక్ష్మణ్, జగదీష్,ప్రభాకర్, ఉమ, వినోద్, శ్రీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
