వాలా హరీష్ రావు స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరిన యువ‌త

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు యువత మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వాలా హరీష్ రావు పేర్కొన్నారు. గంగారం, శాంతినగర్, వైశాలినగర్ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది యువకులు సోమవారం ఆయనను స్వగృహంలో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యువకులు వాలా హరీష్ రావును క‌లిసి తమ మద్దతును ప్రకటించారు. మరికొంత మంది యువత కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వారు వెల్లడించారు.

అనంతరం వాలా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా యువత నిరాశ, నిస్పృహలకు గురవుతోందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని, యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, యువత బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్న యువతను పేరుపేరునా అభినందించిన హరీష్ రావు.. వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వీరందరినీ కుకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి మాధవరం కృష్ణారావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను కలిపి అధికారికంగా పార్టీలో చేరే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు వాలా అక్షిత్, బీసీ నేత ముద్దంగుల మల్లేష్, ఉద్యమకారుడు గణేష్ రెడ్డి, రాము తదితరులు పాల్గొని యువతకు అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here