శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): హుడా కాలనీ మదీనాగూడ డివిజన్లోని స్వామి వివేకానంద యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల లడ్డూ వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో 25 కిలోల గణేష్ లడ్డూను సినీనటి, నిర్మాత డాక్టర్ రోజా భారతి (ఖుషి) రూ.6,66,666లకు దక్కించుకున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ఆమె ఈ లడ్డూను వేలంలో గెలుచుకోవడం విశేషం.

అదేవిధంగా 15 కిలోల లడ్డూను కుశల్ రూ.75,001లకు వేలంలో కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద యూత్ క్లబ్ ఫౌండర్ నందనం విష్ణు దత్ యూత్ సభ్యులు, భక్తుల సమక్షంలో వేలంలో గెలిచిన లడ్డూలను రోజా భారతి, కుశల్కు అందజేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.






