730 రోజుల పాటు రోజుకో మ్యాజిక్ వీడియో.. డాక్టర్ బి.ఎన్.ఎన్. రాజుకు ఘన సన్మానం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏపీ మెజిషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాయాబజార్-2 ఏపీఎంఏ మ్యాజిక్ కన్వెన్షన్ లో డాక్టర్ బి.ఎన్.ఎన్. రాజుకు ఘన సన్మానం చేప‌ట్టారు. ఆదివారం ఖమ్మంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో నిర్వహించిన మ్యాజిక్ ఫెస్టివల్‌లో ఆయనకు రికార్డు అందుకున్న సందర్భంగా ఈ సన్మానం చేశారు. ఏపీ మేజిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జేవీఆర్, సెక్రటరీ ఆర్.ఎల్.తో పాటు గిన్నిస్ రికార్డు హోల్డర్ డాక్టర్ బోస్ చేతుల మీదుగా డాక్టర్ బి.ఎన్.ఎన్. రాజును ఘనంగా సత్కరించారు.

మ్యాజిక్ రంగంలో తనదైన గుర్తింపు సాధించిన రాజు.. రోజుకు ఒక మ్యాజిక్ వీడియో చొప్పున వరుసగా రెండు సంవత్సరాల పాటు, మొత్తం 730 వీడియోలను ఎలాంటి విరామం లేకుండా వాట్సాప్ స్టార్ మ్యాజిక్ గ్రూపులో పోస్ట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నిరంతర ప్రదర్శనకు గుర్తింపుగా ఆయనకు రికార్డు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఎన్.ఎన్. రాజు సుమారు 10 నిమిషాల పాటు మ్యాజిక్ షో నిర్వహించి ప్రేక్షకులను అలరించారు. వినూత్నమైన మ్యాజిక్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుని, ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు అందుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here