నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతిక అని, అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ దేవాలయంలో, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.