నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మజీద్ ల అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. గుట్టల బేగంపేట మజీద్- ఈ- అలంగీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇస్లాం మతం గొప్పతనాన్ని ప్రవక్తల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ
ఇస్లాం ధర్మం, ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లా నిర్ణయించిన ధర్మమని చెప్పారు. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త, ఆఖరి ప్రవక్త ,ఇది ముహమ్మద్ పై శాంతి,శుభాలు కలుగు స్థాపించిన మతం అన్నారు. ఇస్లామీయ ధర్మశాస్త్రాల అనుసారం ఇస్లాం, మానవకళ్యాణం కొరకు అల్లాచే ప్రసాదింపబడిన ఓ సరళమైన శాంతిమార్గం అని చెప్పారు. ఈ మార్గం ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమైందని, అల్లా ప్రజల కొరకు తన ప్రవక్తలను అవతరింపజేస్తూ వచ్చాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు గౌస్, శేరిలింగంపల్లి నాయకులు సలీం, మజీద్-ఈ-అలంగీర్ కమిటీ సభ్యులు రియాజ్, జునైద, జఫ్ఫార్, లయక్, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.