నమస్తే శేరిలింగంపల్లి: మసీద్ బండ లోని బిజెపి కార్యాలయంలో అపర్ణ సెరీనా పార్క్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ తో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సమావేశమయ్యారు. అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను వివరిస్తూ రవికుమార్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. పార్క్ నుంచి మెట్రో వరకు బస్సు సౌకర్యం, దేవాలయం, పోస్టాఫీస్ ను ఏర్పాటు చేయించేలా చూడాలని కోరారు. ఓటర్ గుర్తింపు కార్డులు కావాలని కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అపార్ట్ మెంట్ సభ్యులు రమేష్, ప్రసాద్, వెంకటేష్, పి వి రావు, రవీంద్రన్, రామారావు, కోటేశ్వరావు, రాజేశ్ సింగ్, తిరుమల రావు, భరత్ వ్యాస్, నరసింహ, ప్రసాద్ రావు, రాజ్ కుమార్, విష్ణుకాంత్, అనిల్ జైన్, సంపత్, హరీష్ కుమార్, మోహన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
