తారానగర్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్‌లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దొంతి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ నాయకులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. కార్యక్రమంలో దొంతి సత్యనారాయణ గౌడ్, కార్తీక్ గౌడ్, దీపక్ గౌడ్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, భక్తులు సైతం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here