హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్, సాయినగర్, ఓల్డ్ హఫీజ్ పేట్, జనప్రియ, మదీనాగూడ, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్ సుధాంష్తో కలిసి వరద బాధితులకు కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్‌గౌడ్ శనివారం ప్రభుత్వ సహాయం రూ.10వేలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. అందుకనే ప్రభుత్వ రూ.10వేల సహాయం పంపిణీ చేస్తుందన్నారు. అందరికీ సహాయం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, రెవెన్యూ అధికారులు, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, జేరిపాటి రాజు, శాంతయ్య, బాలింగ్ గౌతమ్ గౌడ్, నరేందర్ గౌడ్, జామీర్, సుధాకర్, తిమ్మయ్య, మల్లేష్, కృష్ణ, పద్మ, సరిత, అధికారి నర్సింగరావు పాల్గొన్నారు.







