నమస్తే శేరిలింగంపల్లి: భర్త తన ఫోన్ కాల్ రికార్డు విని ప్రశ్నించడంతో భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ ఎంఏ వాహీద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా గందీద్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య తన భార్య జి.కృష్ణవేణి ఖాజాగూడలో నివాసం ఉంటున్నారు. మల్లయ్య కారు డ్రైవర్ గా, భార్య కృష్ణవేణి హౌజ్ మెయిడ్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన కృష్ణవేణి ఫోన్ రికార్డు వినగా అందులో మగ గొంతు ఎవరిదని భర్త మల్లయ్య ప్రశ్నించాడు. మరుసటి రోజు భార్య కృష్ణవేణి ఇంటి నుంచి పని నిమిత్తం వెళ్లిపోయి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. భర్త మల్లయ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాహీద్ అలీ తెలిపారు.
