డివిజన్ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా పని చేస్తాం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో రూ. 1 కోటి 40 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు పనులను సంబంధిత అధికారులు, స్థానికవాసులతో కలసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. స్థానిక ప్రజలు విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ల‌గా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు. ఇంటింటికి వెళ్లి సమస్యల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి కృషిచేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశించి కృషిచేస్తామన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారి విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతామని, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షపు నీటి ప్రవాహం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని శాశ్వత పరిష్కార దిశగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్, కుమార్, విజయ్, ఖాసీం, కొండల్ రావు, శ్రీనివాస్ యాదవ్, వినోద్, కొండయ్య, రాజేష్, అంజయ్య, యాదయ్య, సుభాష్, రమణ, ఆంజనేయులు, సాయిరామ్, వినోద్, డేవిడ్, రాజు, ఆంజనేయులు, సురేష్, కిరణ్, మురళి, కుమారి, కృష్ణవేణి, సురేఖ, లక్ష్మి, స్థానిక బస్తీవాసులు, విద్యుత్ విభాగం సభ్యులు, వాటర్ వర్క్స్ విభాగం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here