శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న, బిసి ఐక్యవేదిక నాయకుడు, ముఖ్య సలహాదారు పట్లూరి కృష్ణమోహన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షుడు కొంటు ముకుందం, తమ్మ చంద్రమౌళి, ఎం.వి.ఎస్ నాయక్, కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొంటు సుమన్, ఇస్మాయిల్, చేతిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, సికింద్రాబాద్ అన్నా నగర్ గౌడ సంఘం అధ్యక్షుడు వి శ్రీ శైలం గౌడ్, సూరారం బీసీ నాయకులు సిద్ధార్థ ముదిరాజ్, మేదరి వినాయక్ పటేల్, గాయత్రీ నగర్ బిసి మహిళా నాయకురాలు బి సైదమ్మ, బీసీ నాయకులు బి సురేష్, నోముల ప్రవీణ్ కుమార్, పి రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.






