శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ లో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశికళ, శానిటేషన్ ఎంటమాలజీ అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వర్షాకాలంలో ప్రబలే అంటు వ్యాధుల గురించి ప్రజలకు తెలుపుతు అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు, కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు, కాలనీ వాసులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రోడ్లపై కాలనీలోని ఖాళీ స్థలాల్లో చెత్తను వేయకుండా స్వచ్ఛ పారిశుద్ధ్య ఆటోలలోనే చెత్తను వేయాలని ప్రజలను కోరారు. దోమల నివారణకు ఇళ్లలో చెట్ల కుండీలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని, కాలనీ ఖాళీ ప్రదేశంలో నీరు నిల్వ ఉండకుండా చుసుకోవాలని సూచించారు.






