శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC లో మున్సిపాలిటీలు విలీనమైనందున జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లకు 24% హెచ్ఆర్ఏ మంజూరు చేయించాలని, కలెక్టర్ తో మాట్లాడి ఉద్యోగ ఉపాధ్యాయులకు లాభం చేకూర్చాలని పిఆర్టియుటిఎస్ జిల్లా అధ్యక్షుడు మానేయ, ప్రభుకి జిన్నారం మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పవన్ రాజు, జిన్నారం మండల ఉపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు.






