వ్యర్థాలను రోడ్లపై పారేసిన 15 వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ జరిమానా… మొత్తం రూ.28,500 వసూలు…

నమస్తే శేరిలింగంపల్లి: నిబంధనలకు విరుద్ధంగా వ్యర్ధాలను రోడ్లపై పారవేసిన పలు వ్యాపార సంస్థలకు జిహెచ్ఎంసి పారిశుద్ధ్య విభాగం సిబ్బంది ఆదివారం జరిమానాలు విధించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, జెపిఎన్ నగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని 15 వ్యాపార సంస్థలకు జరిమానాలు వేసినట్లు ఎస్ఆర్పీ కనకరాజు తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.28,500/- వసూలు చేశామని అన్నారు. ఇంటి, వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు ఇలాంటి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో వేయరాదని, నిబంధనలు పాటించని యెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ నాగరాజు గౌడ్, ఇబ్బంది పాల్గొన్నారు.

మియాపూర్ లో ఓ ఫర్నీచర్ వ్యాపారికి జరిమానా విధిస్తున్న ఎస్ఆర్పీ కనకరాజు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here