నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఆరంభ టౌన్షిప్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 12 సంవత్సరాలుగా కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి అంగరంగ వైభవంగా మట్టి వినాయకుని పూజిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో ఏర్పాటు చేసుకునే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవటానికి నూతనంగా ఒక చిన్న నీటి కొలనుని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సురేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు రవీంద్ర రాథోడ్, ట్రెజరర్ రాంభూపాల్ రెడ్డి, సభ్యులు జనార్ధన్, సాయిరాం, నరసింహులు, మహిపాల్ యాదవ్, విక్రమ్ యాదవ్, మహేష్, అరుణ శ్రీ, సుజాత, మౌలిక, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.