మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని శిల్పారామంలో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎత్నిక్ హాల్ లో త్యాగరాజ ఆరాధనా ఉత్సవం నిర్వహించారు. యెల్ల వెంకటేశ్వర్ రావు, శ్యామసుందర్, జయ లక్ష్మి, వోలేటి పార్వతీశం, డీవీ మోహన కృష్ణ, మంద అనంత కృష్ణ, జంట నగరాలలో ఉన్న సంగీత కళాకారులు అందరూ పాల్గొని నగర సంకీర్తన చేశారు. అలాగే త్యాగరాజ పంచరత్నాల బృందగానం ఆలపించారు. త్యాగరాజును స్మరించుకున్నారు.

అనంతరం ఆంఫి థియేటర్ లో వేదవ్యాస్ బృందం ప్రదర్శించిన చెయ్ కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గిరిజ సుతునకు, హరి హరాద్వైతం, భో శంభో, ఒకపరి కొకపరి, శివ పంచాక్షరీ తదితర అంశాలను వేదవ్యాస్, ప్రశాంత్, సింధు, లిఖిత, సౌమ్య ప్రదర్శించి మెప్పించారు.






