ఎంవీఎస్‌ఆర్ కళాశాల అగ్నిప్రమాదంపై విజయభాస్కర్ రెడ్డి దిగ్భ్రాంతి

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఎంవీఎస్‌ఆర్ (MVSR) కళాశాలలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని విజయభాస్కర్ రెడ్డి సూచించారు. కళాశాలల్లో అగ్నిమాపక నివారణ పరికరాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని విద్యాసంస్థల నిర్వాహకులకు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here