నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన రైతు మహా ధర్నాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఎమ్మెల్యే ఇంటి నుంచి బయల్దేరేముందు ఆరెకపూడి గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశచరిత్ర లో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బీడు భూముల నుండి బంగారు సిరులు పండించే దిశగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దక్కుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత ద్వారా నీటి కష్టాలను తీర్చడం జరిగిందన్నారు. 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని, కేంద్రం కొనకుండా, రాష్ట్రం కొనే అవకాశం లేకుండా రైతు చట్టాలతో చేతులు కట్టేసిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని వ్యతిరేక వ్యవసాయ చట్టాల పేరుతో రోడ్డున పడేసిందని ఆవేదన చెందారు. రైతులు కష్టపడి పండించిన వరి పంటను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. కేంద్రం, బిజెపి నాయకులు అనుసరిస్తున్న గందరగోళాన్ని తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలపాలని టీఆర్ఎస్ రైతు ధర్నాలు చేపట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి, రోజా రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రాజు యాదవ్, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, రాజు నాయక్, సమ్మారెడ్డి, కృష్ణ గౌడ్, లక్ష్మీ నారాయణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.