చరిత్ర సృష్టించిన మెడికవర్ వైద్య బృందం -హేమోఫిలియా రోగికి అరుదైన వైద్య చికిత్స

నమస్తే శేరిలింగంపల్లి:హేమోఫిలిక్ వ్యాధితో బాధపడుతున్న రోగికి టీఏవీఆర్ శస్త్రచికిత్స చేసి ఆరోగ్యాన్ని బాగుపరిచారు మెడికవర్ ఆస్పత్రి వైద్య బృందం. భారత దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేసి మెడికవర్ ఆస్పత్రి చరిత్ర సృష్టించింది‌ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం వయసు రీత్యా 79 ఏళ్లు కలిగిన ఓ వ్యక్తి మనసుపరంగా కుర్రకారుతో పోటీపడుతూ రోజుకు 40 సిగరెట్లు కాలుస్తూ హేమోఫిలిక్ (రక్తస్రావణ లక్షణం) వ్యాధితో బాధపడుతూ మెడికవర్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. అయోర్టిక్స్టెనోసిస్ సైతం ఉండటం వల్ల అతనికి మూడుసార్లు సింకోపాల్ అటాక్స్ కూడా కలిగాయి. తీవ్ర అనారోగ్య లక్షణాలుండటంతో పాటుగా వయసు రీత్యా ఆయనకు శస్త్రచికిత్స ద్వారా అరోటిక్‌ వాల్వ్‌ మార్పిడి చేయడం కష్టమన్నారు.

అరుదైన శస్త్రచికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది

మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు రోగి పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి టీఏవీఆర్‌ (క్యాథెటర్‌ అరోటిక్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్) చేయాలని నిర్ణయించి రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో బృహద్ధమని మూత్రపిండ ధమనుల కింద సన్నబడటంతో పాటు కుడివైపున ఉన్న అతని తొడ నరం కూడా బాగా సన్నబడడంతో అతని ఎడమ కాలు తొడ నరం నుంచి టీఏవీఆర్‌ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మొదటగా 23 ఎంఎం మెడ్‌ట్రానిక్‌ ఇవాల్యుయేట్‌ ఆర్‌ వాల్వ్‌ తీసుకుని, కాల్షియం లోపంతో అత్యవసర పరిస్థితులలో ఇంట్యూబేట్‌ చేయడం కష్టమని భావించిన అనస్థీషియా బృందం మత్తుమందు ఇచ్చి వాల్వ్‌ అమరికకు సిద్ధం చేశారు. శస్త్ర చికిత్సలో వాల్వ్‌ ఖచ్చితమైన స్థానంలో అమరడంతో పాటు అరోటిక్‌వాల్వ్‌ చక్కగా పనిచేయడం ప్రారంభించింది. మెడికవర్‌లోని సీనియర్ డాక్టర్ల బృంద నైపుణ్యంతో రెండు రోజుల పాటు పరిశీలనలో ఉంచి పూర్తి ఆరోగ్యంగా చికిత్స అందజేయడం జరిగిందన్నారు. ఆధునిక వైద్య శాస్త్రంలో ఈ చికిత్స ఓ అద్భుతానికి ప్రతీకగా అన్నారు. అసాధారణ కోమార్బిడిటీ పరిస్థితులు ఉన్న రోగులకు భారీ శస్త్ర చికిత్సలు చేయాల్సిన అవసరాన్ని టీఏవీఆర్‌ తగ్గిస్తుందన్నారు. వైద్య చికిత్స చేసిన వారిలో డాక్టర్ ముఖర్జీ కార్డియాలజిస్ట్ తో పాటు డాక్టర్‌ ప్రేమ్‌చంద్‌, డాక్టర్‌ విజయకుమార్‌, డాక్టర్‌ కుమార్‌ నారాయణ్, డాక్టర్‌ కృష్ణ ప్రసాద్, డాక్టర్‌ మాణిక్‌ చోప్రా, డాక్టర్‌ సాయి, డాక్టర్‌ శ్రీనివాస్‌ చక్రవర్తి, డాక్టర్‌ రఘుకాంత్‌, పల్మనాలజిస్ట్, క్యాథ్‌ ల్యాబ్‌ సిబ్బంది అన్నపూర్ణ,అలీ, అరీఫ్‌, మెడ్‌ ట్రానిక్‌ బృందం లావణ్య, నిషా, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య చికిత్స తీరును వివరిస్తున్న మెడికవర్ వైద్య సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here