ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస అభ్య‌ర్థిని గెలిపించాలి

  • కార్పొరేట‌ర్‌ హమీద్ పటేల్

కొండాపూర్‌‌ ‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పట్టభద్రులు అందరూ తమ ఎమ్యెల్సీ ఓటును నమోదు చేసుకొని, తెరాస బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేట‌ర్‌ హమీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో పలు అపార్ట్‌మెంట్ల‌కు వెళ్లి ఆయ‌న‌ పట్టభద్రులకు ఎమ్యెల్సీ ఓటరు నమోదు దరఖాస్తు ఫాంలను అందజేసి, ఓటును నమోదు చేసుకోవాలని అభ్యర్ధించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల‌ పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెరాస బలపరిచిన అభ్యర్థుల‌ విజయం కోసం ప్రతి కార్యకర్త చురుకుగా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట‌ వార్డు మెంబర్ రాజు యాదవ్, పీఎస్‌బీ రెడ్డి, రంగారావు ఉన్నారు.

ఓట‌రు న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్‌ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here