భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో వి. పాండు యాదవ్ కు ఘ‌న స‌న్మానం

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో వి. పాండు యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్భంగా భేరి రామ‌చంద‌ర యాద‌వ్ పాండుయాద‌వ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా పాండుయాద‌వ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగా వెనుకబడిన‌ యాదవులకు దామాషా పద్ధతిన అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, కార్వాన్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ గోవర్ధన్, సుశీల్ కుమార్, పల్లె మొగల్పురా డివిజన్ అధ్యక్షుడు బాలు మహేందర్, మొఘల్ పుర డివిజన్ ఉపాధ్యక్షుడు పాండు యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పాండు యాద‌వ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్న భేరి రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here