శేరిలింగంపల్లి, డిసెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఆత్మ బలిదానం చేసుకున్న ఈశ్వరచారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శేరిలింగంపల్లి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నాయకులు ఈశ్వర చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి స్వర్ణకార సంఘం తరపున మార్కెట్ బంద్ పాటించారు. అనంతరం భెల్ సర్కిల్ నుంచి ఓల్డ్ శేరిలింగంపల్లి సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మారోజు ప్రభాకర్ చారి, గౌరవ అధ్యక్షుడు అంబిడి రఘు చారి, ప్రధాన కార్యదర్శి పవిత్ర ఆంజనేయులు చారి, కోశాధికారి పి.శ్రీధర్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు వలబోజు రవి చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, స్వర్ణకార సంఘం నాయకులు, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.






