హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌కు తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్ చైర్మన్ కె.సునీల్ గౌడ్, బీసీఐ మెంబర్ పి.విష్ణు వర్దన్ రెడ్డిలు చౌహాన్‌ను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.






